|  
● FLASH NEWS
Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  •  ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం.. ధ్వంసమైన కారు  • 
Skip to content

Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి

తిరుపతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి (Tirupati) జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంగళం సప్తగిరి కాలనీ పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy), టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి (Sudha Reddy) అనూహ్యంగా ఎదురుపడ్డారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో సుధారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ శ్రేణులను, నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చగొట్టవద్దని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఆమె చెవిరెడ్డిని కోరారు.

చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే తాము కూడా అక్కడికే వెళ్తామని, ‘మా అన్నతోనే ఉంటాం’ అంటూ సుధారెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఇలా నేరుగా మాట్లాడుకోవడం స్థానికంగా ఆసక్తి రేపింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp