
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జన్మదినాన్ని పురస్కరించుకుని మేడిపల్లిలోని ‘మాతృ అభయ’ అనాథాశ్రమంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, అనంతరం వారికి పండ్లు, మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జనగామ సంతోష్, డాక్టర్ పెంచల సతీష్ తదితరులు పాల్గొని పిల్లలకు భోజనం వడ్డించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



