బంజారాహిల్స్: విద్యా సంవత్సరాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీస్

హైదరాబాద్ బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె వెంకటేశ్ తన సమయస్ఫూర్తితో ఒక విద్యార్థిని విద్యా సంవత్సరాన్ని కాపాడారు గురువారం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సమయంలో బంజారాహిల్స్ సమీపంలో ఒక విద్యార్థిని తన పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలియక తీవ్ర ఆందోళనతో ఉండటాన్ని ఆయన గమనించారు పరీక్ష సమయం దగ్గరపడుతుండటంతో ఆ విద్యార్థిని కళ్ళలో నీళ్లు పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తుండగా కానిస్టేబుల్ వెంటనే స్పందించారు
సమయం మించకుండా మాసబ్ ట్యాంక్ వరకుపరీక్షా కేంద్రం మాసబ్ ట్యాంక్ లో ఉందని గుర్తించిన కానిస్టేబుల్ వెంకటేశ్ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు నిమిషాల వ్యవధిలో ఆమెను సురక్షితంగా మరియు సకాలంలో మాసబ్ ట్యాంక్ లోని కేంద్రానికి చేర్చారు కానిస్టేబుల్ చేసిన ఈ సాయంతో ఆ విద్యార్థిని పరీక్షకు హాజరు కాగలిగింది ఒకవేళ ఆయన స్పందించకపోయి ఉంటే ఆ విద్యార్థిని పరీక్షకు దూరం అయ్యే పరిస్థితి నెలకొనేది పోలీసులంటే కేవలం శాంతిభద్రతలే కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారని ఆయన నిరూపించారు

సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
కానిస్టేబుల్ వెంకటేశ్ చేసిన ఈ సాయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు ఈ వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి ఒక విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విధులు పక్కన పెట్టి మరీ సహాయం చేసిన ఆయన తీరును ఉన్నతాధికారులు అభినందించారు ప్రజలకు మరియు పోలీసులకు మధ్య ఉన్న బంధాన్ని ఇలాంటి సంఘటనలు మరింత బలోపేతం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు