
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (BRAOU) బతుకమ్మ (Bathukamma) వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. క్యాంపస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సంబురాల్లో విశ్వవిద్యాలయ మహిళా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మహిళలంతా సమిష్టిగా జరుపుకునే గొప్ప పూల పండుగ బతుకమ్మ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి, మహిళా విభాగపు ఇంచార్జ్ ప్రొఫెసర్ కె. రాణి రజిత మాధురి మహిళా సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పల్లవి కబ్డే, ప్రొఫెసర్ రజని, ప్రొఫెసర్ చంద్రకళ, డాక్టర్ ఎ. రమాదేవి తదితరులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, డాక్టర్ యాకేష్ దైద, పాండు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



