|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

BRAOU: ఘనంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం

1001176078
1001176078

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) చేతుల మీదుగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 27వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం క్యాంపస్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన వేలాది మంది విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలను ప్రదానం చేసి వారిని అభినందించారు.

నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

ఈ స్నాతకోత్సవంలో ప్రముఖ సినీ దర్శకుడు, ప్రఖ్యాత కవి, నటులు బి. నర్సింగ్ రావుకు గవర్నర్ శుక్లా గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. తెలంగాణ సంస్కృతిని, ప్రజల సామాజిక వాస్తవాలను తన చిత్రాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో నర్సింగ్ రావు చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

మారుమూల విద్యార్థులకు వరం

గ్రామీణ, మారుమూల, వెనుకబడిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 25 లక్షలకు పైగా విద్యార్థులు ఈ యూనివర్సిటీ ద్వారా విద్యావకాశాలు పొందారని గుర్తుచేశారు. పట్టభద్రులైన వారిలో సగానికి పైగా మహిళలే ఉండటం “బేటీ బచావో బేటీ పడావో” స్ఫూర్తికి నిదర్శనమన్నారు. అలాగే డిజిటల్ విద్యపై ఉన్నత విద్యాసంస్థలు మరింత దృష్టి సారించాలని, యువత డ్రగ్స్ రహిత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఖైదీకి గోల్డ్ మెడల్.. ఆశ్రితకు మూడు పతకాలు

ఈ స్నాతకోత్సవంలో అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో బొజ్జనపల్లి శ్రీ ఆశ్రిత అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏకంగా మూడు బంగారు పతకాలను సాధించారు. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన ఓ ఖైదీ ఎన్. సురేష్ అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై ఒక బంగారు పతకం, బుక్ ప్రైజ్ అందుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తం వివిధ జైళ్ల నుంచి 26 మంది పురుషులు, ఒక మహిళా ఖైదీ సహా 27 మంది డిగ్రీలు అందుకున్నారు.

డిజిటల్ విద్యతో సామాజిక లక్ష్యం

కార్యక్రమంలో వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, డిజిటల్ సాంకేతిక అవకాశాలతో సామాజిక లక్ష్యాన్ని మిళితం చేసి సమ్మిళిత, నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. న్యాక్ పూర్వ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నత విద్యా వ్యవస్థలో ఓపెన్ యూనివర్సిటీ విధానం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ, డిప్లొమా పట్టాలు, 38 మందికి బంగారు పతకాలు, 23 మందికి పీహెచ్‌డీలు ప్రదానం చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp