|  
● FLASH NEWS
CJP: ఢిల్లీలో సీజేపి నేతల అరెస్ట్.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్  •  ఎల్‌నినో: కోవిడ్ లాంటి విపత్తు, సీఎం రేవంత్ హెచ్చరిక  •  BRS: హరీష్ రావుపై ఫేక్ లేఖ కుట్ర.. బీఆర్ఎస్ ఫైర్  •  APSRTC: దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు  •  NewDelhi: దేశం మొత్తం జంతర్ మంతర్ అవుతుంది.. మోదీ ఒక పిరికి నియంత: దీప్కే  • 
Skip to content

BRS: హరీష్ రావుపై ఫేక్ లేఖ కుట్ర.. బీఆర్ఎస్ ఫైర్

brs harish rao fake letter
brs harish rao fake letter

హైదరాబాద్, సూర్య న్యూస్ : అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao) ప్రతిష్టను దిగజార్చేలా నకిలీ లేఖ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి (BRS Party) రాష్ట్ర నాయకులు గుండాల మల్లేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు.

సోమ భరత్ కుమార్ పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఫేక్ లేఖను విడుదల చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను హరీష్ రావు నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే, కావాలని ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ, హోం శాఖ అధికారులు తక్షణమే స్పందించి సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా లోతైన విచారణ జరిపించాలని కోరారు. ఫేక్ లేఖను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోని యెడల, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గుండాల మల్లేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ​ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సురేష్ గౌడ్ మరియు సాయి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp