నాడు హైదరాబాద్.. నేడు అమరావతి: బిల్ గేట్స్‌తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చారిత్రక భేటీ
నాడు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన చారిత్రక బంధం.. నేడు అమరావతి వేదికగా పునరావృతమైంది. ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఏఐ పాలన, వ్యవసాయ ఆధునికీకరణ మరియు ఆరోగ్య రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
