కురుక్షేత్ర ఎన్ఐటిలో విషాదం: హాస్టల్ గదిలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
హర్యానాలోని కురుక్షేత్ర ఎన్ఐటి (NIT)లో తెలంగాణకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి అంగోద్ శివ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకు చెందిన ఈ విద్యార్థి బలవన్మరణానికి గల కారణాలపై థానేసర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

