
బెంగళూరు, సూర్య న్యూస్ : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ (IND vs WI) జట్ల మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక ఫైనల్ టీ20 (T20 Match) వర్షం కారణంగా రద్దయింది. సాయంత్రం నుంచి వర్షం పడటంతో టాస్ వేయడం తీవ్రంగా ఆలస్యమైంది. మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది.
వర్షం తగ్గుముఖం పట్టడంతో అంపైర్లు మ్యాచ్ను 9 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్ కేవలం 10 బంతుల్లో 30 పరుగులు చేయగా, నమన్ ధీర్ 6 బంతుల్లోనే 24 పరుగులతో నాటౌట్గా నిలిచి దూకుడుగా ఆడారు. అయితే, భారత ఇన్నింగ్స్ 7.4 ఓవర్ల వద్ద మళ్లీ భారీ వర్షం మొదలుకావడంతో ఆటను కొనసాగించడం సాధ్యం కాలేదు, దీంతో మ్యాచ్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



