
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో దసరా (Dussehra) పండుగ వేళ మద్యం అమ్మకాలు (Liquor Sales) ఊహించని రీతిలో భారీగా నమోదయ్యాయి. పండుగకు ముందు కేవలం నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.755.14 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది దసరా విక్రయాల రికార్డులను సైతం ఈసారి మందుబాబులు తిరగరాశారు.
గతేడాది దసరా సమయంలో రూ.698 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగగా, ఈసారి ఆ రికార్డు పూర్తిగా బద్దలైంది. ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 6,83,000 కేసుల లిక్కర్, అలాగే 10,44,000 కేసుల బీరు అమ్ముడైంది.
రోజువారీ అమ్మకాల జోరు
దసరా పండుగ సందర్భంగా రోజువారీగా సాగిన విక్రయాలను పరిశీలిస్తే.. అక్టోబర్ 14న రూ.102.17 కోట్లు, అక్టోబర్ 16న రూ.126.32 కోట్లు, అక్టోబర్ 17న రూ.223.25 కోట్ల మేర వ్యాపారం జరిగింది. ఇక పండుగ సందడి తారాస్థాయికి చేరిన అక్టోబర్ 19వ తేదీన ఒక్కరోజే అత్యధికంగా రూ.303.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



