
హైదరాబాద్, సూర్య న్యూస్ : ఎల్నినో పరిస్థితులపై ముందస్తు చర్యలు చేపట్టకపోతే అది తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను హెచ్చరించారు. ఎల్నినో (El Nino) అనేది కోవిడ్ లాంటి విపత్తు అని, ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు.
మళ్లీ వర్షాలు వచ్చే వరకూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ వరకు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని స్పష్టం చేశారు.
ఎల్నినో ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముందస్తు జాగ్రత్తలతోనే ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



