|   
🔴 BREAKING NEWS ► PM Modi Latest Video : మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు Police Job Aspirant Arrested : నిరుద్యోగుల బంద్ ఎఫెక్ట్.. హాస్టల్ వద్దే పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ అరెస్ట్ Delhi Police Warning : ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసుల సంచలన వార్నింగ్.. ఆ తప్పు చేశారో ఇక మీ పాస్‌పోర్ట్ రద్దే Nandamuri Balakrishna Knee Surgery : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య మోకాలి ఆపరేషన్ సక్సెస్
Skip to content

గాజులరామారం మహారాజా గార్డెన్ లో ఉత్సాహంగా మహిళా పారిశ్రామికవేత్తల ప్రదర్శన: ప్రారంభించిన పునారెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని మహారాజా గార్డెన్ లో మహిళా సాధికారతను చాటిచెప్పే విధంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు- డీఎంఎస్ మిత్ర పవర్ కేపీహెచ్‌బీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సుమారు 70 కి పైగా మహిళా పారిశ్రామికవేత్తల స్టాల్స్ ను మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు-

మహిళా ఆర్థికాభివృద్ధే లక్ష్యం

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఈ సందర్భంగా సొంటిరెడ్డి పునారెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఇలాంటి వేదికలను కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు- ఈ స్టాల్స్ ద్వారా మహిళా సోదరీమణులు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశం లభిస్తుందని దీనివల్ల అటు ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుతాయని ఇటు మహిళలకు ఉపాధి మెరుగుపడుతుందని వివరించారు- మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మద్దతు

వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న మహిళలకు తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు- రాబోయే రోజుల్లో ఇలాంటి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని వెల్లడించారు- నియోజకవర్గంలో ఎక్కడ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించినా ట్రస్ట్ తరపున అండగా ఉండి ఆర్థికంగా అలాగే సామాజికంగా తోడ్పాటు అందిస్తామని పునారెడ్డి స్పష్టం చేశారు- ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp