|  
● FLASH NEWS
BRAOU: మలేషియా సదస్సులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులపై చర్చ  •  Diplomacy: జైశంకర్ దౌత్య వ్యూహం.. యూఎస్ విదేశాంగ మంత్రి ముందే పాక్ గుట్టు రట్టు  •  SupremeCourt: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువుపై కీలక ఆదేశాలు  •  PayalRajput: నా శరీరం నా ఇష్టం.. ట్రోలర్స్‌పై మండిపడ్డ హీరోయిన్ పాయల్  •  Warning: రౌడీలు, సోషల్ మీడియా సైకోల తాట తీయాలి.. పోలీసులకు సీఎం చంద్రబాబు వార్నింగ్  • 
Skip to content

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు కొలన్ హన్మంత్ రెడ్డికి ఆహ్వానం

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ నిర్వాహకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ప్రగతి నగర్‌లోని ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమ వివరాలను వివరించారు.​

ఈ నెల 18-03-2026, బుధవారం నాడు ప్రగతి నగర్‌లోని శ్రీకృష్ణ గార్డెన్స్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సమాజంలో మహిళల పాత్రను గౌరవిస్తూ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా పలువురు ప్రతిభావంతులైన మహిళలను సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి (వాసవి క్లబ్ జోనల్ చైర్పర్సన్ & ట్రస్ట్ ఫౌండర్ చైర్పర్సన్), దేవరశెట్టి స్రవంతి, రాధిక, అనంతలక్ష్మి (ప్రోగ్రాం కోఆర్డినేటర్స్) పాల్గొన్నారు. వీరితో పాటు వాసవి క్లబ్ సమైక్యశక్తి ప్రగతి నగర్ అధ్యక్షులు ఉప్పల వినయ్, జనరల్ సెక్రటరీ పోలా వెంకట్, వాసవి క్లబ్ వనిత సమైక్యశక్తి అధ్యక్షురాలు పోలా సంధ్య తదితరులు పాల్గొని కొలన్ హన్మంత్ రెడ్డిని ఆహ్వానించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp