|  
FLASH NEWS
NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  •  Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!  •  Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  •  Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  • 
Skip to content

Nani The Paradise : ‘ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. జడల్ జమానా షురూ…!

హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యాచురల్ స్టార్ నాని (Hero Nani), టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ప్యారడైజ్’ (The Paradise Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

శిల్పకళా వేదికలో గ్రాండ్ ఈవెంట్

ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “జడల్ జమానా తన అడ్డాకు చేరుకొంది” అంటూ ఈ సందర్భంగా విడుదల చేసిన నాని కొత్త పోస్టర్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో నాని రెండు జడలతో, కుక్కపిల్లతో కలిసి సరికొత్త మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.

24న ప్రపంచవ్యాప్తంగా విడుదల

భారీ అంచనాల నడుమ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో విడుదలైన ‘ఆయా షేర్’, ‘యేష నాగుల’ సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచి మ్యూజికల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp