|  
● FLASH NEWS
Sanofi: ఇన్స్‌మెడ్‌ను 4,100 కోట్ల డాలర్లకు కొనుగోలు  •  WhatsApp: సరికొత్త ఫీచర్ రాబోతోంది.. మీకు తెలుసా?  •  Chiranjeevi: ‘ఆకాశంలో ఒక తార’ చూసి చలించిపోయిన మెగాస్టార్  •  RBI: డిజిటల్ చెల్లింపులకు అత్యవసర స్టాప్ స్విచ్  •  Cricket: 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్!  •  Andhra Pradesh: మూడు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి.. సీఎం ఆరా  • 
Skip to content

Viral Video : కన్నప్రేమను కాదని.. కాళ్లపై పడిన తల్లిదండ్రులను వదిలేసి ప్రియుడితో వెళ్లిన కూతురు

తిరుపత్తూరు, సూర్య న్యూస్: ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు ప్రేమ పేరుతో కన్నవారికి కన్నీళ్లు మిగిల్చింది. హృదయాన్ని కలిచివేసే ఈ ఘటన తమిళనాడులోని (Tamil Nadu) తిరుపత్తూరులో (Tirupattur) చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయంపై ఆ యువతి చివరి వరకు వెనక్కి తగ్గలేదు.

కన్నీళ్లతో కూతురి కాళ్లపై పడి వేడుకున్న తల్లిదండ్రుల (Parents) ప్రేమ కూడా ఆమె మనసు మార్చలేకపోయింది. వారి ఆవేదనను పక్కనబెట్టి తన నిర్ణయానికే కట్టుబడి ప్రియుడితో (Lover) ఆమె వెళ్లిపోయింది. కన్నప్రేమ ఓడిపోయిన ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. కన్నవారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) చూసిన వారిని సైతం భావోద్వేగానికి గురిచేస్తోంది. తల్లిదండ్రులు ఎంతగా బతిమిలాడినా ఆమె కనికరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ హృదయ విదారక దృశ్యాలు నెట్టింట వైరల్‌గా (Viral Video) మారాయి.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు