|  
● FLASH NEWS
APSRTC: దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు  •  NewDelhi: దేశం మొత్తం జంతర్ మంతర్ అవుతుంది.. మోదీ ఒక పిరికి నియంత: దీప్కే  •  Balakrishna: రోడ్డు విస్తరణకు 862 గజాల స్థలమిచ్చిన హీరో బాలకృష్ణ  •  BRAOU: అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలకు రేపే ఆఖరు  •  TeamIndia: మూడో టీ20లో ఉత్కంఠ విజయం.. 2-1తో సిరీస్ ఆధిక్యం  • 
Skip to content

Viral: ఒకే ఫ్రేమ్‌లో దళపతి, రౌడీ బాయ్, నేషనల్ క్రష్

హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌ను (Thalapathy Vijay) కలిశారు. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.

“దళపతి విజయ్ సార్‌తో ఎంతో అందమైన సమయాన్ని గడిపాను. బిజీ షెడ్యూల్ తర్వాత కూడా ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. జీవితం, కెరీర్, ప్రపంచం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మాతో పంచుకున్నారు” అని విజయ్ దేవరకొండ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఒక్క సమావేశంతోనే ఆయన తన ఫేవరెట్‌గా మారిపోయారని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనపై తన ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటాయని తెలుపుతూ దళపతి విజయ్, రష్మికతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ముగ్గురు స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp