|  
● FLASH NEWS
Summit: అమెరికా, చైనా, రష్యా కీలక భేటీ.. నాలుగు ప్రధాన నిర్ణయాలు  •  Harish: సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్  •  Jobs: హైదరాబాద్‌లో 83 దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  •  TGBIE: ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే  •  Workers: కార్మికులకు అన్యాయం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు: బీఆర్‌టీయూ నేత రవి  •  UGCNET: యూజీసీ నెట్ డిసెంబర్-2026 పరీక్షా షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ సబ్జెక్టులంటే?  • 
Skip to content

Osmania: ఓయూ బోధనేతర సిబ్బంది సమ్మె విరమణ.. సంఘం జనరల్ సెక్రటరీ కాంతం ప్రేమ్ కుమార్ వెల్లడి

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) బోధనేతర ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 23 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TUNTEA) ప్రకటించింది. మంగళవారం ఓయూ (OU) వైస్ ఛాన్సలర్ రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి, ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం సెక్రటరీ జనరల్ కాంతం ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఉద్యమ కార్యక్రమాలను విరమించుకోవాలని నిర్ణయించుకున్నామని ప్రేమ్ కుమార్ తెలిపారు. అయితే, సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర సంఘం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజాస్వామ్యబద్ధంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సాగించిన ఈ పోరాటానికి మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, మేధావులు, పాత్రికేయ మిత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “ఉద్యోగుల ఐక్యతే మన బలం.. న్యాయమైన హక్కుల సాధనే మన లక్ష్యం” అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు