|  
● FLASH NEWS
Warangal: రూ.50 వేల అప్పు కోసం దంపతుల ఆత్మహత్య.. సీవీ ఆనంద్ ఆవేదన  •  SRH: సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్టులో సంచలనం.. ట్రావిస్ హెడ్ ఎందుకు లేరో తెలుసా?  •  PV Sindhu: నాలుగేళ్ల తర్వాత మళ్లీ టాప్ 5లో సింధు.. ఈ ఎదుగుదల వెనుక కథేంటి?  •  SAFF: పాకిస్తాన్‌పై భారత్‌కు పదో ట్రోఫీ.. 88వ నిమిషంలో ఏం జరిగిందో తెలుసా?  •  KTR: కేటీఆర్ సాయంతో కోట్లు టర్నోవర్ సాధిస్తున్న దివ్యాంగుడు  • 
Skip to content

BRS: ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. పుప్పాల భాస్కర్ భరోసా

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రమాదవశాత్తు గాయపడిన బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకురాలు భాగ్యలక్ష్మిని సూరారం డివిజన్ (Suraram) పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ పరామర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌కు చెందిన భాగ్యలక్ష్మి చేతికి గాయమైందని తెలుసుకున్న ఆయన.. ఆమె నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన భాస్కర్, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భాగ్యలక్ష్మిని పరామర్శిస్తున్న పుప్పాల భాస్కర్

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని పుప్పాల భాస్కర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ, కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి, గండయ్య, కిరణ్ సాగర్, దశరథ్, అన్వర్, ప్రశాంత్, అఖిల్, రవికుమార్, సుమన్, లావణ్య, ధనలక్ష్మి మరియు పలువురు బస్తీ నాయకులు పాల్గొన్నారు.

పుప్పాల భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు