|  
● FLASH NEWS
Gowda: గౌడ సామాజిక వర్గ చరిత్రపై డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ పరిశోధన  •  Local Elections: సర్పంచ్ పదవి కోసం బంపర్ ఆఫర్లు.. రూ.కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు  •  Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్  •  Jobs: కృష్ణా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్  •  Teenmar: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం.. డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు  • 
Skip to content

Quthbullapur: ఓపెన్ జిమ్ ఏర్పాటు దిశగా ముందడుగు.. ప్రజావాణిలో అధికారులకు వినతి

కుత్బుల్లాపూర్ ప్రజావాణిలో ఓపెన్ జిమ్ కోసం జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న వీరారెడ్డి నరేందర్ రెడ్డి, స్థానికులు
ప్రజావాణిలో ఓపెన్ జిమ్ కోసం వినతిపత్రం అందజేస్తున్న స్థానికులు

హైదరాబాద్, సూర్య న్యూస్ : కుత్బుల్లాపూర్ (Quthbullapur) సుచిత్ర సమీపంలోని వెంకటేశ్వర ఎన్‌క్లేవ్ గన్ పార్క్‌లో ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ (Open Gym) ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానికులు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వెంకటేశ్వర ఎన్‌క్లేవ్ కాలనీ జనరల్ సెక్రటరీ వీరారెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్‌ను కలిసి ఈ మేరకు విన్నవించారు.

వినతిపై సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్.. రెండు రోజుల్లోగా ఓపెన్ జిమ్ ఏర్పాటుకు సంబంధించిన అంచనా వ్యయం (ఎస్టిమేట్) తయారు చేసి, ఆ ఫైల్‌ను సమర్పించాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)ను ఆదేశించారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, యువత ఫిట్‌నెస్, వృద్ధుల శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించిన జోనల్ కమిషనర్‌కు కాలనీ వాసుల తరపున వీరారెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, రమణరావు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp