|  
● FLASH NEWS
Gowda: గౌడ సామాజిక వర్గ చరిత్రపై డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ పరిశోధన  •  Local Elections: సర్పంచ్ పదవి కోసం బంపర్ ఆఫర్లు.. రూ.కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు  •  Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్  •  Jobs: కృష్ణా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్  •  Teenmar: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం.. డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు  • 
Skip to content

Quthbullapur: ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం: కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కారం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ (Quthbullapur) సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ (Kuna Srisailam Goud) స్పష్టం చేశారు. షాపూర్ నగర్‌లోని ఆయన నివాస కార్యాలయంలో సోమవారం పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

షాపూర్ నగర్‌లోని నివాస కార్యాలయంలో స్థానికులతో మాట్లాడుతున్న కూన శ్రీశైలం గౌడ్
షాపూర్ నగర్‌లోని నివాస కార్యాలయంలో స్థానికులతో మాట్లాడుతున్న కూన శ్రీశైలం గౌడ్

సమస్యల పరిష్కారానికి కృషి

ఈ భేటీ సందర్భంగా పలువురు స్థానికులు.. తమ ప్రాంతాల్లో నెలకొన్న మంచినీరు, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర సమస్యలను కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానికుల విజ్ఞప్తులపై వెంటనే స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కూన శ్రీశైలం గౌడ్
స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కూన శ్రీశైలం గౌడ్

అందుబాటులో ఉంటానని హామీ..

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను సైతం వేగవంతం చేసేలా అధికారులతో సమన్వయం చేసుకుంటానని శ్రీశైలం గౌడ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్‌ను అన్ని విధాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు వివాహ శుభకార్యాలు, అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆయనకు అందజేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే శ్రీశైలం గౌడ్, తమ సమస్యలపై సానుకూలంగా స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

అయ్యప్ప మహా పడిపూజ ఆహ్వాన పత్రికను అందుకుంటున్న కూన శ్రీశైలం గౌడ్
అయ్యప్ప మహా పడిపూజ ఆహ్వాన పత్రికను అందుకుంటున్న కూన శ్రీశైలం గౌడ్

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp