|  
● FLASH NEWS
Crime: జపాన్ మహిళపై లైంగిక దాడి ఆరోపణలు.. యోగా కేంద్రం నిర్వాహకుడి అరెస్ట్  •  Jabardasth: రోడ్డు ప్రమాదంలో దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు  •  Test: న్యూజిలాండ్‌పై భారత్ పరుగుల సునామీ.. 720/9తో భారీ ఆధిక్యం  •  Canada: కెనడాలో ఇద్దరి కాల్చివేత.. వెలుగులోకి సంచలన విషయాలు!  •  Health: రాప్తాడు బాలిక ఆరోగ్యంపై తీపి కబురు.. త్వరలోనే ఇంటికి!  •  Drugs: డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక.. ఇక ఆస్తులపైనే గురి!  • 
Skip to content

Quthbullapur: వినాయక నగర్‌లో రూ.49 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ డెస్క్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వినాయక నగర్‌లో రూ.49 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

రూ.49 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు

వినాయక నగర్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు. పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం కూన శ్రీశైలం గౌడ్ స్థానికులతో మాట్లాడారు.

వినాయక నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపనకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

2014లోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాం: కూన

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. 2014 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెబుతున్నారని అన్నారు.

తాము జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుంటే, పనులు పూర్తయ్యాక రిబ్బన్ కటింగ్ చేయడం సిగ్గుచేటని కూన శ్రీశైలం గౌడ్ వ్యాఖ్యానించారు.

వినాయక నగర్‌లో స్థానికులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కూన శ్రీశైలం గౌడ్

నిధుల కేటాయింపుపై సీఎం, మంత్రికి కృతజ్ఞతలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకు కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ రావు, మురళి కృష్ణ, యాదగిరి, పాండు, నాగరాజు, కరీం, శివ రామ రాజు, ధనుంజయ్ నాయక్, చందన్ తదితరులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు