|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

Actor Uttej : ‘తప్పు చేశావ్ పద్దూ..’ భార్య వర్ధంతి వేళ నటుడు ఉత్తేజ్ భావోద్వేగ పోస్ట్

హైదరాబాద్: ప్రముఖ నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మావతి వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ అభిమానుల కంటతడి పెట్టిస్తోంది. భార్యతో ఉన్న పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉత్తేజ్ రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఉత్తేజ్ భార్య పద్మావతి 2021 లో క్యాన్సర్ బారినపడి కన్నుమూశారు. ఆమె మరణించినప్పటి నుండి ఉత్తేజ్ ఆ బాధలోనే ఉన్నాడు.

తాజాగా పెళ్లి రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఉత్తేజ్ ఒక పోస్ట్ పెట్టాడు. అందులో, ‘ఈ రోజు మన పెళ్లి రోజు. ఇప్పుడు బాగా గుర్తుంటుంది.. అప్పట్లో, నీ పుట్టినరోజని,మన పెళ్లిరోజని మాత్రం రెండు నెలల ముందునుండే గుర్తుపెట్టుకొని.. డేట్ వల్లె వేస్తూ ఉండేవాణ్ణి….ఎక్కడ మర్చిపోతానో అని…. ఇది అందరి మొగుళ్లకి అనుభవకవేద్యమే……. ఎలా ఉన్నావు పద్దూ…’ అంటూ రాసుకొచ్చాడు.

ఆ తర్వాత, ‘కడదాకా, నే కడతేరే దాకా నా వెంటే ఉంటానన్నావు. మార్గమధ్యంలో చెయ్యి వదిలేశావ్…పట్టు సడలి కిందపడ్డాను…లేచి చూస్తే నువ్వు లేవు..పిలిచా..అరిచా..ఏడ్చా.నువ్వులేవు.. ఇంకా వెతుకుతూనే వున్నా.. సంతలో తప్పిపోయిన పిల్లాడు అమ్మకోసం వెదుక్కున్నట్టు…. తప్పు చేసావు పద్దూ.. నన్ను మరీ dependent చేసావ్.. అన్నిటికీ తోడున్నావ్.. అన్నిటికీ ముందున్నావు. నేనున్నాను పదయ్యా అన్నావు. నేనున్నగా పర్లేదన్నావ్..ధైర్యం అయ్యావు..ఆలంబన అయ్యావు..ఆసరా అయ్యావు…ముందుంటావనుకున్నా..ముందుగా వెళ్తావనుకోలేదు..’ అంటూ తన భావోద్వేగాన్ని బయటపెట్టాడు.

‘mis you.. నాన్నలా భుజం తట్టావు.. తిట్టావు కూడా.. అమ్మలా అక్కున చేర్చుకున్నావు.. ఫ్రెండ్ లా తోడున్నావు.. పాటమ్మకి నిన్ను తెచ్చివ్వలేను కానీ… ఆ స్పర్శ ని అందివ్వలేను కానీ….నీ బాధ్యతని..నీ ప్రేమని అందించే ప్రయత్నం చేస్తున్నా…. నాన్న లా 100% ఉంటాను.. దానికి నేనయినా ఉన్నాను… నాకే……………లేరు.. Love you.. పద్దూ.’ అని పోస్ట్ ను ముగించాడు.

ఉత్తేజ్ పెట్టిన ఈ పోస్ట్ కు అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. ఉత్తేజ్ మరియు ఆయన కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తేజ్ మరియు పద్మావతి ల జోడీ చాలా బాగుండేదని, వారి ప్రేమకథ చాలా స్ఫూర్తిదాయకమని చెబుతున్నారు. ఉత్తేజ్ కి దేవుడు మరింత ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp