
నాగారం, సూర్య న్యూస్ :రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి (Excise Minister) జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కు ఊహించని నిరసన సెగ తగిలింది. నాగారం (Nagaram) మండలం ఫణిగిరి గ్రామంలో ఆయన కాన్వాయ్‌ను తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) ఆధ్వర్యంలో గౌడ కులస్తులు మంత్రిని చుట్టుముట్టి నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ, గీత కార్మికులకు (Geetha Karmikulu) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఇచ్చిన మాట ప్రకారం కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లు (Safety Kits) వెంటనే పంపిణీ చేయాలని కోరారు. తాటి చెట్ల పైనుండి ప్రమాదవశాత్తు పడి మరణించిన గీత కార్మికులకు నెల రోజుల్లో పెండింగ్ ఎక్స్‌గ్రేషియా (Ex-gratia) చెల్లిస్తామని చెప్పి, ఇంతవరకు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
వైన్ షాపులలో (Wine Shops) గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు (Reservations) ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మాట తప్పిందని వారు ఆరోపించారు. రాష్ట్రంలో గీత పారిశ్రామిక సొసైటీల పట్ల, కార్మికుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మంత్రి జూపల్లిని నిలదీసిన ఈ కార్యక్రమంలో రెడ్డి మల్ల, సమ్మయ్య గౌడ్, చింటూ గౌడ్, సురేష్ గౌడ్, నాతి అశోక్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



