|  
● FLASH NEWS
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  •  Flydubai: విమానం కూల్చేయాలనేదే నా ప్లాన్.. కో-పైలట్ సంచలన నిజాలు  • 
Skip to content

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్, సూర్య న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యవహారంలో బీఆర్ఎస్ నేత (BRS Leader) మన్నె క్రిశాంక్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) తాజాగా అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సీఎం ఆస్తులపై ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, భారీ పెట్టుబడులపై క్రిశాంక్ ఇటీవల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏకంగా రూ.50 వేల కోట్లకు పైగా ఆస్తులు, పెట్టుబడులు ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో యాక్షన్

ముఖ్యమంత్రి కుటుంబంపై క్రిశాంక్ చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. తాజాగా క్రిశాంక్‌ను అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp