|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

Tollywood Controversy : టాలీవుడ్‌లో కలకలం.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ!

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar Master) వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో (Telugu Film Dancers Association) ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఫెడరేషన్ అనుమతి లేకుండానే అసోసియేషన్‌లో బైఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశం కాస్త ఉద్రిక్తంగా మారింది.

ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదానికి నిరసనగా దాదాపు 10 మంది డాన్సర్లు (Dancers) తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రాజీనామాలపై ఇప్పటివరకు అసోసియేషన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే జానీ మాస్టర్ లేదా శేఖర్ మాస్టర్ కూడా ఈ వ్యవహారంపై బహిరంగంగా స్పందించలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాదం ఎలా ముగుస్తుందో, అసోసియేషన్ లేదా ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఆసక్తికరంగా మారింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp