|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

Telangana High Court : జలమండలికి హైకోర్టులో భారీ షాక్.. కారుణ్య నియామకాలపై కీలక తీర్పు

హైదరాబాద్, సూర్య న్యూస్ : కారుణ్య నియామకాల (Compassionate Appointments) విషయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది. రివ్యూ పిటిషన్ వేసిన హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWSSB) కు కోర్టులో భారీ చుక్కెదురైంది. కారుణ్య నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.

తల్లి మరణించడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని హైదరాబాద్ కు చెందిన పి. కవిత అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని నియామకంపై నిర్ణయం తీసుకోవాలని 2025 లో తీర్పు వెలువరించింది. అయితే జలమండలి (Water Board) ఈ తీర్పును అమలు చేయకుండా పునః సమీక్ష కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

​దీంతో పాటు పాత కారణాలతోనే తనకు ఉద్యోగం నిరాకరించడంపై బాధితురాలు కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. రికార్డుల్లో స్పష్టమైన తప్పు ఉన్నప్పుడు మాత్రమే రివ్యూ పిటిషన్ వేయాలని స్పష్టం చేశారు. రివ్యూ అనేది అప్పీలుకు ప్రత్యామ్నాయం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కొత్త అంశాలు లేకుండా వేసిన జలమండలి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

పిటిషనర్ అభ్యర్థనను మరోసారి పరిశీలించి కారుణ్య నియామకానికి సంబంధించి నాలుగు వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని జలమండలి అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణను మూసివేస్తూ తీర్పునిచ్చింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp