|   
🔴 BREAKING NEWS ► AP Telangana Rain Alerts : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య
Skip to content

HPCL Jobs 2026 : ఇంజనీరింగ్ పూర్తి చేశారా: రాత పరీక్ష లేకుండానే HPCL లో 358 పోస్టులు!

హైదరాబాద్, సూర్య న్యూస్: కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) మార్కెటింగ్ డివిజన్ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో మొత్తం 358 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice) పోస్టులను సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మరియు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య 64.

ఉత్తర ప్రదేశ్ లో పోస్టుల సంఖ్య 37.​

గుజరాత్ లో పోస్టుల సంఖ్య 32.​

తమిళనాడులో పోస్టుల సంఖ్య 20.​

తెలంగాణలో (Telangana) పోస్టుల సంఖ్య 19.

​ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) పోస్టుల సంఖ్య 15.​

ఢిల్లీలో పోస్టుల సంఖ్య 18.​

రాజస్థాన్ లో పోస్టుల సంఖ్య 17.

​పంజాబ్ లో పోస్టుల సంఖ్య 16.

​ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ (Engineering) విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూలై 31, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.​

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను అకాడమిక్ మెరిట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మరియు సంస్థ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 చొప్పున స్టైపెండ్ (Stipend) చెల్లిస్తారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ (Online) విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31, 2026 గా నిర్ణయించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp