|  
● FLASH NEWS
RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  •  Flydubai: విమానం కూల్చేయాలనేదే నా ప్లాన్.. కో-పైలట్ సంచలన నిజాలు  •  Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  • 
Skip to content

Singer Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. అసలు మా ఇంట్లో ఏం జరుగుతోంది ?.. యూట్యూబ్ థంబ్‌నైల్స్‌పై సింగర్ హేమచంద్ర ఫైర్

1000955176
shravan-bhargavi-divorce-family-controversy

హైదరాబాద్, సూర్య న్యూస్: ప్రముఖ నేపథ్య గాయకుడు (Playback Singer) వేదాల హేమచంద్ర (Hemachandra) తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భార్య, ప్రముఖ గాయని శ్రావణ భార్గవి (Sravana Bhargavi)తో ఆయన విడాకులు (Divorce Rumors) తీసుకుంటున్నారంటూ గత మూడేళ్లుగా జరుగుతున్న ప్రచారాలు, యూట్యూబ్ క్లిక్‌బైట్ థంబ్‌నైల్స్‌పై ఆయన ఘాటుగా స్పందించారు. ఓ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం దిగజారి చేస్తున్న ప్రచారాల తీరును ఎండగట్టారు.

​యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న క్లిక్‌బైట్ థంబ్‌నైల్స్‌పై హేమచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా “మా పాప తల్లిదండ్రులు కలవాలని వేడుకుంటోంది” అంటూ పెట్టిన ఒక థంబ్‌నైల్‌ను ప్రస్తావిస్తూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. “మా ఇంట్లో ఎప్పుడూ జరగని విషయాన్ని మీరెలా చిత్రీకరిస్తారు? ఏం పిచ్చి పట్టిందా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సమాజంలో అందరూ చూసి సిగ్గుపడే ఇలాంటి పనులను ఎవరూ చేయకూడదని ఆయన హితవు పలికారు.

ఇలాంటి నిరాధారమైన అసత్య వార్తలు పబ్లిక్ స్పేస్‌లో లేని కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా చిన్న పిల్లల మనస్తత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా తమపై ఇలాంటి పుకార్లు వస్తున్నప్పటికీ, తామిద్దరం ఎప్పుడూ దీనిపై బహిరంగంగా మాట్లాడలేదని తెలిపారు. అనవసరంగా ఇలాంటి అంశాలను రచ్చ చేసి సాగదీయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ఒక కుట్రపూరిత ప్రచారానికి పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన భావోద్వేగాలు, అసలు నిజాలు ఏమిటో అర్థం కావాలంటే తన సరికొత్త “ADHD” మ్యూజిక్ ఆల్బమ్‌లోని ‘యు ఆర్ మైన్’ (You Are Mine) పాట వినాలని, విజ్ఞులైన వారికి అందులోనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని వెల్లడించారు.

అదే సమయంలో శ్రావణ భార్గవిని అద్భుతమైన పాప్ ఆర్టిస్ట్‌గా హేమచంద్ర కొనియాడారు. ఆమెలో ఎంతో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని ప్రశంసించారు. వ్యక్తిగత జీవితంలో ఏవైనా విభేదాలు లేదా సమస్యలు ఉంటే వాటిని నాలుగు గోడల మధ్య ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలి తప్ప, సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడం సరికాదని ఆయన తేల్చి చెప్పారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp