
కడప, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలజీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార’ (Jal Jeevan Mission 2.0) ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లాంఛనంగా ప్రారంభించింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్ ఆవిష్కరణ, శంకుస్థాపనలు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మరణార్థం ఈ బృహత్తర తాగునీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆయన పేరును నామకరణం చేసింది.
కోట్లాది మందికి లబ్ధి
రాష్ట్రవ్యాప్తంగా నీటి సరఫరా వ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేసేందుకు రూ.30,156.12 కోట్లతో మొత్తం 50,315 పనులకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వీటిలో దాదాపు 27,301 పనులు ఇప్పటికే పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 24,601 జనావాసాల్లోని సుమారు 3.27 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు తలసరి రోజుకు 55 లీటర్ల చొప్పున సురక్షిత తాగునీరు అందనుంది.
కొత్తగా 27 లక్షల కనెక్షన్లు
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 27.36 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 61.60 లక్షల ఇళ్లకు ఈ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. తాజా ప్రాజెక్టులో భాగంగా గండికోట, పీఏబీఆర్, వెలుగోడు తదితర రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకుని 77,243 కిలోమీటర్ల మేర కొత్త పైప్లైన్లు, 14,995 నీటి నిల్వ నిర్మాణాలు, 1,426 ఎంఎల్డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



