
గుంటూరు, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్-2.0 పథకం కింద మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శంకుస్థాపన చేశారు.
గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఒక వినూత్న పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ విధానంలో చేపట్టనున్న ఇళ్ల పనులకు వారు శంకుస్థాపన చేశారు.
ఈ సరికొత్త 3డీ విధానం ద్వారా ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు సమయం కూడా ఎంతో ఆదా అవుతుందని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ విధానంలో నిర్మించిన ఇళ్లలో ఉష్ణోగ్రత సాధారణం కంటే దాదాపు 8 డిగ్రీల వరకు తక్కువగా ఉంటుందని లబ్ధిదారులకు ఆయన వివరించారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



