
చండూరు, సూర్య న్యూస్ : చండూరు మండలం గుండ్రపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కురుపాటి శ్రీను మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. బాధిత కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ ఉజ్జిని ఉషా అనిల్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కురుపాటి భిక్షమయ్య కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ టేకుల వినోద్ రెడ్డి, వార్డు సభ్యులు తీగల వెంకన్న, వడ్డమల్ల మధు, ఇతర నాయకులు పెండ్యాల ఉపేందర్, దామెర అనిల్, కురుపాటి రాజు, సాయిలు, కృష్ణ, నక్క కృష్ణయ్య, క్రాంతి, నవీన్, కొమ్మనపల్లి శ్రీను, భూతరాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



