|  
FLASH NEWS
Vijay Sai Reddy : నెంబర్ 1 సజ్జల, నెంబర్ 2 జగన్.. 74 అవమానాలు భరించలేకే కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన లేఖ  •  Nepal Floods 2026 : కష్టకాలంలో ఆదుకున్న భారత్‌కు నేపాల్ అధ్యక్షుడి భావోద్వేగ సందేశం.. వరదల్లో ప్రాణనష్టంపై కన్నీటిపర్యంతం  •  Singer Mangli Case : మంగ్లీతో రాజీ పడలేదు.. ఆమెను కాపాడుతున్న కేంద్ర మంత్రి ఎవరు.. అడ్వకేట్ సుబ్బు సంచలన వ్యాఖ్యలు  •  AIMIM MLC Expelled : ఎంఐఎం ఎమ్మెల్సీపై బహిష్కరణ వేటు.. ఆ వీడియోల వ్యవహారమే అసలు కారణమా?  •  Vijay Mallya : నాకో న్యాయం వాళ్లకో న్యాయమా.. 22 వేల కోట్ల బకాయికి 6 కోట్లతో సెటిల్మెంటా?  • 
Skip to content

పత్తలేని పంతుళ్ళు .. పెచ్చులూడుతున్న బిల్డింగులు!

  • టెక్నాలజీ కాలేజీల స్టూడెంట్ల గోస
  • వీసీ ఓఎస్‌డీకి ఏబీవీపీ వినతి

ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ (సూర్య న్యూస్): ఎంతో పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. మౌలిక వసతుల లేమి, హాస్టల్ కష్టాలు, సిబ్బంది కొరత తదితర సమస్యలతో కళాశాల అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఓఎస్‌డీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.

సుమారు 1,400 మంది విద్యార్థులు అభ్యసిస్తున్న ఈ కళాశాలలో కేవలం నలుగురే ప్రొఫెసర్లు ఉండటం విచారకరం. గత 30 ఏళ్లుగా ఒక్కసారి కూడా శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపట్టలేదు. 2006 నుంచి పలుమార్లు నోటిఫికేషన్లు విడుదలైనా, కోర్టు ఆదేశాలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో పోస్టుల భర్తీ ముందుకు సాగలేదు. మొత్తం 44 మంజూరైన పోస్టులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా, ఫుడ్ టెక్నాలజీ విభాగంలో ఒక్క శాశ్వత అధ్యాపకుడు కూడా లేకపోవడం గమనార్హం. శాశ్వత బోధనా సిబ్బంది లేకపోవడంతో ఎన్‌బీఏ, యూజీసీ, డీఎస్‌టీ వంటి అత్యున్నత సంస్థల నుంచి దక్కాల్సిన గుర్తింపు, సదుపాయాలకు కళాశాల దూరమవుతోంది.

మరోవైపు కళాశాలలోని క్లాస్ రూమ్‌లు, హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరి విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. 2018లోనే కొత్త భవనాలకు నిధులు మంజూరైనా నేటికీ నిర్మాణాలు నోచుకోలేదు. ఇక బాలికల హాస్టల్‌లో ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన గదిలో పది మంది వరకు ఉంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. కార్మికులకు సరైన వేతనాలు లేకపోవడంతో సరయు, సెంటెనరీ హాస్టల్ మెస్‌లు మూతపడి విద్యార్థులు భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుస్థితిని వెంటనే చక్కదిద్దాలని ఏబీవీపీ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఓయూ అధ్యక్షుడు, కార్యదర్శి శేఖర్, నాయకులు మోక్షిత్, రాష్ట్ర టెక్నికల్ సెల్ ప్రముఖ్ డా. సుమన్ శంకర్, రాజు, దినేష్, తన్మయ్ తో పాటు పలువురు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

IMG 0676
File Photo

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp