
నల్లగొండ: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం ఓ నవజాత శిశువు మృతి చెందడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు నమోదైంది. పట్టణానికి చెందిన కంబంపాటి కవిత మగబిడ్డకు జన్మనివ్వగా, కాసేపటికే ఆ శిశువు ప్రాణాలు విడిచాడు. ప్రసవ సమయంలో వైద్యుల అజాగ్రత్తే దీనికి కారణమని బంధువులు ఆరోపించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆసుపత్రి యాజమాన్యం, బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది మల్లేపల్లి నవీన్‌కుమార్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



