|  
FLASH NEWS
PM Narendra Modi : విదేశాల్లో పెళ్లిళ్లు, టూర్లు వద్దు.. దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు  •  Telangana Politics : సంతోష్, హరీష్ రావులనైనా క్షమిస్తా కానీ ప్రశాంత్ రెడ్డిని వదలను: కల్వకుంట్ల కవిత  •  AP Deputy CM Pawan Kalyan : పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి.. ఏపీ డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు  •  Asaduddin Owaisi : ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ అవార్డుపై అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు  •  టార్గెట్ ‘సరిహద్దు’.. నిఘా నిల్.. చోరీలు ఫుల్..  • 
Skip to content

PM Narendra Modi : విదేశాల్లో పెళ్లిళ్లు, టూర్లు వద్దు.. దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

2026-27 తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. స్వదేశీ మంత్రం పాటించాలని ప్రజలకు పిలుపు.

suryanews PM Modi
suryanews PM Modi

న్యూఢిల్లీ, సూర్య న్యూస్: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి (PM Narendra Modi) సంతోషం వ్యక్తం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు (Growth Rate) 7.8 శాతంగా నమోదు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు యుద్ధాలతో తీవ్రంగా సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారతదేశం మాత్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు స్వదేశీ మంత్రాన్ని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజలు విదేశాల్లో డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవడం, విదేశీ టూర్లకు వెళ్లడం లాంటివి సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. స్వదేశీ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ వృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఇదే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ క్యాంపెయిన్‌ను ఆయన తప్పుబట్టారు. ఆ క్యాంపెయిన్ ‘ఝూట్ కీ గూంజ్’ (అబద్ధాల ఉద్యమం) అని మోదీ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు కేవలం తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp