|  
FLASH NEWS
Telangana Politics : సంతోష్, హరీష్ రావులనైనా క్షమిస్తా కానీ ప్రశాంత్ రెడ్డిని వదలను: కల్వకుంట్ల కవిత  •  AP Deputy CM Pawan Kalyan : పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి.. ఏపీ డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు  •  Asaduddin Owaisi : ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ అవార్డుపై అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు  •  టార్గెట్ ‘సరిహద్దు’.. నిఘా నిల్.. చోరీలు ఫుల్..  •  Vijay Sai Reddy : నెంబర్ 1 సజ్జల, నెంబర్ 2 జగన్.. 74 అవమానాలు భరించలేకే కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన లేఖ  • 
Skip to content

లిటిల్ ఫ్లవర్ స్కూల్లో విద్యార్థులకు నైపుణ్యం, భాష, విలువలపై అవగాహన

కమ్మగూడెం: కమ్మగూడెం(భీమనపల్లి)లోని సెయింట్ థెరిస్సా లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ‘నైపుణ్యం, భాష, విలువలు’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక సమగ్ర విద్యా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశుభ్రత, సమయపాలనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ సెషన్ సాగింది. ఇందులో భాగంగా విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పేపర్ ఒరిగామి వంటి కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జపనీస్ భాష, సంస్కృతిని పరిచయం చేయడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు ‘ఒహాయో గొజైమస్’ (శుభోదయం), ‘కొంబన్వా’ (శుభ సాయంత్రం), ‘అరిగతో గొజైమస్’ (ధన్యవాదాలు) వంటి జపనీస్ పదాలను నేర్చుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రిసోర్స్ పర్సన్ రెవ. పవన్ కుమార్ మార్నేని జపాన్‌లో తన అనుభవాలను పంచుకొని, ‘నైపుణ్యం సృజనాత్మకతను పెంచుతుందని, భాష ప్రపంచ స్థాయికి తలుపులు తెరుస్తుందని’ వివరించారు. ప్రిన్సిపాల్ సిస్టర్ జోష్న, యాజమాన్యం, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమం.. ‘క్రమశిక్షణ, విశ్వాసం మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి’ అనే సందేశంతో విజయవంతంగా ముగిసింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp