|  
● FLASH NEWS
ParaGames: ఏషియన్ పారా గేమ్స్‌లో పతకాల పంట.. గోల్డ్ కొట్టిన తెలంగాణ అథ్లెట్ దీప్తి  •  MLC: పూరి గుడిసె నుంచి పట్టభద్రుల పోరు దాకా.. ఎమ్మెల్సీ బరిలో ఉద్యమకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్!  •  PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  • 
Skip to content

నేడు బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలపై ప్రత్యేక ‘ఫోన్ ఇన్’

suryanews braou phone in featured 1200x630
suryanews braou phone in featured 1200×630

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈరోజు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వర్సిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు తమ అనుమానాలను నేరుగా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునేలా ఈ ఏర్పాట్లు చేశారు.

ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో వర్సిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు పాల్గొననున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి కె. నీలిమ అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు.

ఫోన్ చేయాల్సిన నెంబర్లు

వర్సిటీ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యార్థులు నేరుగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య సంప్రదించవచ్చు. దీనికోసం 040-23240852, 040-23240853, 040-29550923 నెంబర్లకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియ, అర్హతలు, కోర్సుల వివరాలపై స్పష్టత కోరుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp