
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ (UG/PG Admissions) కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించింది.
విశ్వవిద్యాలయం అందించే బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, తదితర పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌లో నేరుగా ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందడానికి ఈ పొడిగింపు వర్తిస్తుందని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పాత విద్యార్థుల ఫీజు చెల్లింపునకు అవకాశం
కొత్త అడ్మిషన్లతో పాటు 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు, అలాగే 2017 నుంచి 2025 మధ్య కాలంలో ప్రవేశాలు పొంది సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన పాత బ్యాచ్‌ల విద్యార్థులకు కూడా వర్సిటీ మరో అవకాశం కల్పించింది. వీరు కూడా అక్టోబర్ 13వ తేదీ లోపు క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్, టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా తమ ట్యూషన్ ఫీజును చెల్లించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ప్రవేశాలు, ఫీజుల చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాలు, ఆన్‌లైన్ నమోదు కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్లు www.braouonline.in లేదా www.braou.ac.in ను సందర్శించవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని లేదా వర్సిటీ హెల్ప్‌డెస్క్ నంబర్లు 040-23680222, 23680333, 23680444, 23680555, టోల్ ఫ్రీ నంబర్ 18005990101 లో సంప్రదించవచ్చని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



