|  
FLASH NEWS
BRAOU Admissions 2026: డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు  •  Telangana Cabinet Expansion: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కేనా? తెరపైకి మునుగోడు ఎమ్మెల్యే పేరు!  •  YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  • 
Skip to content

BRAOU Admissions 2026: డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, సూర్యా న్యూస్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల ప్రవేశాల గడువును పెంచింది. యూజీ, పీజీతో పాటు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు గడువును (Admissions Last Date) సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి.

ఈ నిర్ణయంతో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కోరే విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా చేరే విద్యార్థులతో పాటు గత విద్యా సంవత్సరాల్లో చేరిన పాత బ్యాచ్‌ల విద్యార్థులు కూడా తమ వార్షిక ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న వారు, అలాగే 2017 నుంచి 2025 వరకు వివిధ బ్యాచ్‌లలో చేరి సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన పాత డిగ్రీ, పీజీ విద్యార్థులు కూడా సెప్టెంబర్ 30 లోగా తమ ట్యూషన్ ఫీజును చెల్లించవచ్చు. ఈ ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో పాటు ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా సులభంగా జమ చేయవచ్చు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం విద్యార్థులు తమ సమీపంలోని అంబేద్కర్ వర్సిటీ అధ్యయన కేంద్రాలను సంప్రదించవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్లు www.braouonline.in, www.braou.ac.in ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే హెల్ప్‌డెస్క్ నంబర్లు 040-23680222, 23680333, 23680444, 23680555 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 18005990101 ద్వారా అధికారులను సంప్రదించవచ్చని విశ్వవిద్యాలయం పేర్కొంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp