|  
● FLASH NEWS
APSRTC: దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు  •  NewDelhi: దేశం మొత్తం జంతర్ మంతర్ అవుతుంది.. మోదీ ఒక పిరికి నియంత: దీప్కే  •  Balakrishna: రోడ్డు విస్తరణకు 862 గజాల స్థలమిచ్చిన హీరో బాలకృష్ణ  •  BRAOU: అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలకు రేపే ఆఖరు  •  TeamIndia: మూడో టీ20లో ఉత్కంఠ విజయం.. 2-1తో సిరీస్ ఆధిక్యం  • 
Skip to content

BRAOU: అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలకు రేపే ఆఖరు

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU)లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు గడువు ముగుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ (Post Graduation) కోర్సులతో పాటు వివిధ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అక్టోబర్ 13వ తేదీని ఆఖరి రోజుగా వర్సిటీ అధికారులు ప్రకటించారు.

డిగ్రీ విభాగంలో బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులతో పాటు పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ కోర్సులతో పాటు అన్ని ఓడీఎల్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు కూడా అక్టోబర్ 13 వరకే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ గడువును ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే అవకాశం లేదని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని, నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాలు, ఇతర సందేహాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ braouonline.in లేదా braou.ac.in ను సందర్శించవచ్చు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ కాల్ సెంటర్ నంబర్ 18005990101 లేదా ఇన్ఫర్మేషన్ సెంటర్ నంబర్లు 040-23680222, 23680333 లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సమీపంలోని అధ్యయన కేంద్రాలను కూడా సంప్రదించవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp