
పనాజీ, సూర్య న్యూస్ : బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ (Nana Patekar) మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మెయిన్ కరోనరీ ఆర్టరీలో (ధమని) బ్లడ్ గడ్డకట్టడంతో ఆయనకు తీవ్రమైన గుండెపోటు (Heart Attack) వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
కరోనరీ ఆర్టరీ వ్యాధితో ముడిపడి ఉన్న తీవ్రమైన మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ కారణంగానే నటుడు మరణించారని రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ఆయన మృతిని వైద్యులు సహజ మరణంగానే నిర్ధారించారు. మరోవైపు, ఆయన మరణానికి ముందు మూడు గంటల్లో ఏం జరిగిందనే విషయాలను మణిపాల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ శేఖర్ సల్కర్ వెల్లడించారు.
మరణానికి ముందు ఆ 3 గంటల్లో ఏం జరిగింది?
మరణానికి సుమారు 3 గంటల ముందు అంటే రాత్రి 2:30 గంటల సమయంలో తన ఆరోగ్యం బాగాలేదని పటేకర్ తన స్నేహితుడికి మెసేజ్ చేశారు. అయితే, ఆ సమయంలో స్నేహితుడు ఆ మెసేజ్ చూసుకోలేదు. ఉదయం 4:00 గంటలకు ఫోన్ చేయడంతో అప్రమత్తమైన స్నేహితుడు వెంటనే ఆయన ఇంటికి వెళ్లారు. అప్పటికే పటేకర్‌కు తీవ్రంగా చెమటలు పడుతున్నాయని, ఆయన సృహ కోల్పోతున్నారని డాక్టర్లు తెలిపారు.
వెంటనే అప్రమత్తమైన కేర్ టేకర్, స్నేహితులు ఆసుపత్రికి సమాచారం అందించారు. అంబులెన్స్‌లో సీపీఆర్ చేస్తూ ఉదయం 4:20 నుంచి 4:30 గంటల మధ్య ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే ఆయన స్పందించకపోవడంతో ఉదయం 5:30 గంటలకు మరణించినట్లు డాక్టర్ శేఖర్ సల్కర్ ప్రకటించారు.
నటనకే పరిమితం కాని సేవా దృక్పథం
నానా పటేకర్ కేవలం నటనకే పరిమితం కాలేదు. ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ నామ్ ఫౌండేషన్ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2015లో మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మహిళల ఉపాధి కోసం కుట్టు మెషిన్లు, పిండి మిల్లులు పంపిణీ చేశారు.
అనేక కరువు గ్రామాలను దత్తత తీసుకొని, వందల కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. నదుల పునరుజ్జీవనానికి సైతం ఆయన ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా కూడా సేవలు అందించి తన విశేషమైన దేశభక్తిని చాటుకున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



