|  
● FLASH NEWS
APSRTC: దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు  •  NewDelhi: దేశం మొత్తం జంతర్ మంతర్ అవుతుంది.. మోదీ ఒక పిరికి నియంత: దీప్కే  •  Balakrishna: రోడ్డు విస్తరణకు 862 గజాల స్థలమిచ్చిన హీరో బాలకృష్ణ  •  BRAOU: అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలకు రేపే ఆఖరు  •  TeamIndia: మూడో టీ20లో ఉత్కంఠ విజయం.. 2-1తో సిరీస్ ఆధిక్యం  • 
Skip to content

Balakrishna: రోడ్డు విస్తరణకు 862 గజాల స్థలమిచ్చిన హీరో బాలకృష్ణ

హైదరాబాద్, సూర్య న్యూస్ : నగరంలోని కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రహదారి విస్తరణ కోసం ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన వంతు సహకారం అందించారు. రోడ్డు విస్తరణ నిమిత్తం తన సొంత స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు.

కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా బాలకృష్ణకు చెందిన 862.77 చదరపు గజాల స్థలాన్ని తీసుకునేందుకు అధికారులు ప్రతిపాదించగా, ఆయన సానుకూలంగా స్పందించి స్థలాన్ని అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనతో పాటు శబ్దాలయ స్టూడియో, భవ్య కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు కూడా టీడీఆర్ ద్వారా తమ స్థలాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

ఇదిలా ఉండగా, ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా తగ్గించే లక్ష్యంతో ఈ మార్గంలో భారీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. సుమారు రూ. 1,090 కోట్ల భారీ వ్యయంతో 4.3 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రముఖులు సైతం రోడ్డు విస్తరణకు స్వచ్ఛందంగా స్థలాలు ఇస్తుండటంతో ఈ పనులకు మరింత వేగం పెరగనుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp