
కాకినాడ, సూర్య న్యూస్ : సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) షూటింగ్ లో గాయపడ్డారు. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK111 సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో (Kakinada Port) జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ (Manchu Manoj), బాలకృష్ణ మధ్య ఒక కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఆయన మోకాలికి స్వల్ప గాయం అయింది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం షూటింగ్ ను నిలిపివేసింది. వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్టులోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




