
ముంబై, సూర్యా న్యూస్ : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పరిమిత బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం 30 రోజుల్లోనే రూ. 120 కోట్ల వసూళ్ల మార్కును దాటి సంచలనం సృష్టించిందని దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అధికారికంగా వెల్లడించింది.
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా పరిమిత స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల మౌత్ టాక్ ద్వారా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అద్భుతమైన కంటెంట్, ప్రేక్షకుల మద్దతుతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా రోజురోజుకూ స్థిరంగా పుంజుకుంది.
ఈ ఏడాది స్లీపర్ హిట్గా రికార్డు
పరిమిత థియేటర్లలో మొదలైన ఈ సినిమా ప్రయాణం వంద కోట్లకు పైగా వసూళ్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ అరుదైన విజయంతో ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత ఆశ్చర్యకరమైన స్లీపర్ హిట్లలో ఒకటిగా నిలిచిందని సినీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. చిత్ర యూనిట్ విడుదల చేసిన తాజా పోస్టర్లో కూడా ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీకగా పేర్కొనడం గమనార్హం.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



