|  
FLASH NEWS
CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  •  PM Modi Ganesh Puja: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని  • 
Skip to content

BRAOU B.Ed Counselling : రేపటి నుంచే అంబేద్కర్ వర్శిటీ బి.ఎడ్ కౌన్సెలింగ్.. ఏ సబ్జెక్టుకు ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్, సూర్య న్యూస్ : డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బి.ఎడ్ (B.Ed) ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఏయే సబ్జెక్టుల వారికి ఏ తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందనే కీలక వివరాలను వర్సిటీ అధికారులు తాజాగా వెల్లడించారు.

వెబ్ ఆప్షన్ల ద్వారా సీట్లు సాధించిన అభ్యర్థులకు ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా వేర్వేరు తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 17వ తేదీన మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టులు ఎంచుకున్న అభ్యర్థులకు, 18వ తేదీన సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులు ఎంచుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ జరగనుందని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలతో నేరుగా క్యాంపస్‌కు చేరుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే వర్సిటీ టోల్ ఫ్రీ నంబర్ 18005990101 లేదా 040-23680222, 333, 444, 555 నంబర్లలో ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లు braouonline.in లేదా braou.ac.in పోర్టల్‌ను సందర్శించాలని యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp