|  
FLASH NEWS
Election Commission SIR Notices : అద్వానీ, జైశంకర్ సహా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. అసలేమిటీ ‘సర్’ (SIR) ప్రక్రియ?  •  Houthi Attacks on Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ రెబల్స్ భీకర దాడులు.. పాకిస్థాన్, తుర్కియేలకు తీవ్ర హెచ్చరికలు!  •  Rahul Gandhi Comments : లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!  •  NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  • 
Skip to content

Election Commission SIR Notices : అద్వానీ, జైశంకర్ సహా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. అసలేమిటీ ‘సర్’ (SIR) ప్రక్రియ?

ఢిల్లీ, సూర్య న్యూస్ : ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో (SIR Process) భాగంగా దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్ర మంత్రులకు నోటీసులు జారీ కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ జాబితాలో రాజకీయ ఉద్దండులు, అత్యున్నత పదవుల్లో ఉన్న అధికారులు కూడా చేరడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

అద్వానీ నుంచి ఎలక్షన్ కమిషనర్ వరకు..

తాజాగా ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందుకున్న వారిలో మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే. అద్వానీ, ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉన్నారు. వీరితో పాటు ఏకంగా ఎలక్షన్ కమిషనర్ ఎస్.ఎస్. సంధు, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీలకు కూడా నోటీసులు వెళ్లడం గమనార్హం. అలాగే నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈ నోటీసులు అందాయి.

కేజ్రీవాల్ ఇంట్లో ఐదుగురికి నోటీసులు

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఏకంగా ఐదుగురికి ఈ ‘సర్’ నోటీసులు జారీ అయ్యాయి. కేజ్రీవాల్‌తో పాటు ఆయన సతీమణి సునీత, తండ్రి గోవింద్ రామ్, తల్లి గీతా దేవి, 25 ఏళ్ల కుమారుడు పుల్కిత్‌లకు ఎన్నికల సంఘం ఈ నోటీసులను పంపింది. గత ఓటర్ల జాబితా ప్రస్తుత ‘సర్’ జాబితాతో మ్యాచ్ కాలేదన్న కారణంతోనే వీరికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు అందులో పేర్కొన్నారు.

కారణం ఏమిటి? ఇప్పుడు ఏం చేయాలి?

ఓటర్ల జాబితాలో పేర్లలో తేడాలు ఉండటం, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడం వంటి సాంకేతిక కారణాలతోనే ఎన్నికల సంఘం ఈ నోటీసులను జారీ చేస్తోంది. నోటీసులు అందుకున్న వీరంతా అధికారుల ముందు స్వయంగా హాజరై, తమ ఓటును సరిచేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి తగిన ఆధారాలు, పత్రాలను అధికారులకు సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp