
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంసీలోని రెండు గ్రూపులకు వేర్వేరుగా పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులను కేటాయిస్తూ ఈసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. రానున్న ఉప ఎన్నికల దృష్ట్యా ఈ మేరకు చర్యలు చేపట్టింది.
కొత్త పేర్లు, గుర్తులు ఇవే..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమత ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరును ఎన్నికల సంఘం ఖరారు చేసింది. అలాగే ఈ వర్గానికి ఎన్నికల బరిలో నిలిచేందుకు వీలుగా ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును అధికారికంగా కేటాయించింది.
రెబెల్ గ్రూప్‌కు డెమోక్రటిక్ టీఎంసీ
మరోవైపు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న రెబెల్ గ్రూప్‌కు కూడా ఈసీ గుర్తింపునిచ్చింది. ఈ రెబెల్ వర్గానికి ‘డెమోక్రటిక్ టీఎంసీ’ అనే పేరును ఎన్నికల సంఘం కేటాయించింది. వీరికి ఎన్నికల గుర్తుగా ‘ఎన్వలప్ కవర్’ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కేవలం ఉప ఎన్నికల కోసమే..
అయితే, ఈ రెండు వర్గాలకు కేటాయించిన ఈ కొత్త పార్టీ పేర్లు, గుర్తులు శాశ్వతం కాదని, కేవలం త్వరలో జరగనున్న ఉప ఎన్నికల కోసమేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తాత్కాలికంగా మాత్రమే వీటిని అలాట్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. ఈ తాజా పరిణామంతో రానున్న ఉప ఎన్నికల్లో మమత వర్గం, రెబెల్ వర్గం మధ్య హోరాహోరీ పోరు జరగనుందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



