|  
FLASH NEWS
​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  •  Zombie Reddy 2 : జాంబీ ప్రపంచంలోకి రియల్ స్టార్ ఎంట్రీ.. పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో ఉపేంద్ర  •  IND vs AFG 3rd T20 : ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్  • 
Skip to content

Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?

ముంబై, సూర్య న్యూస్ : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana Movie) చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌కు తగినట్లుగా ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్ వెర్షన్‌లో చిత్ర బృందం పలు కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.

ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ నిడివి, హిందీ వర్షన్ కంటే సుమారు 30 నిమిషాలు తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. విదేశీ ప్రేక్షకులకు పాటలు అంతగా అలవాటు ఉండవు కాబట్టి, ఇంగ్లీష్ వర్షన్ నుంచి పాటలతో పాటు కొన్ని సీన్లను కూడా తొలగించనున్నట్లు సమాచారం. అయితే, భారతీయ భాషల్లో విడుదలయ్యే ఇండియన్ వెర్షన్‌లో మాత్రం మ్యూజిక్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మన ప్రేక్షకులకు సంగీతం, భావోద్వేగాలు చాలా ముఖ్యం కావడంతో ఒరిజినల్ వెర్షన్‌లో ఎలాంటి కోతలు ఉండవని స్పష్టమవుతోంది.

దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ ఇతిహాస చిత్రం దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్‌డేట్‌తో ఈ విజువల్ వండర్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp