|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి

బెంగళూరు, సూర్య న్యూస్ : కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో (Renukaswamy Murder Case) ప్రధాన నిందితులుగా ఉన్న నటి పవిత్ర గౌడ (Pavithra Gowda), హీరో దర్శన్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే జైల్లో తోటి ఖైదీల వేధింపులు తాళలేక పవిత్ర గౌడ కోర్టులో కన్నీరుమున్నీరవగా.. మరోవైపు ఈ హత్య ఎలా జరిగిందనే దానిపై అప్రూవర్‌గా మారిన మరో నిందితుడు పోలీసుల విచారణలో అత్యంత కిరాతకమైన నిజాలను వెల్లడించాడు.

చనిపోయేందుకు విషం ఇవ్వండి: పవిత్ర గౌడ

ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటి పవిత్ర గౌడ న్యాయమూర్తి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలులో ఉన్న నైజీరియన్ మహిళలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె వాపోయారు. తనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని, లేదంటే చనిపోయేందుకు విషం అయినా ఇవ్వాలని ఆమె కోర్టును వేడుకున్నారు. జైల్లో పవిత్ర గౌడను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన జైలు అధికారులు ఆమెను భద్రత దృష్ట్యా మరో బ్యారక్‌కు మార్చారు.

ఉరివేసి కొట్టి చంపిన దర్శన్

మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో మరో నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించాడు. అసభ్యకర సందేశాలు పంపాడన్న కోపంతో రేణుకాస్వామిపై దర్శన్ తీవ్రస్థాయిలో దాడి చేసినట్లు ప్రదోష్ తెలిపాడు. పవిత్ర గౌడ సైతం తన చెప్పుతో రేణుకాస్వామిని కొట్టిందని, ఆ తర్వాత దుస్తులు తొలగించి కేవలం లోదుస్తులతో ఉన్న అతడిని నైలాన్ తాడుతో కట్టేసి టాటా ఏస్ వాహనానికి వేలాడదీసి అత్యంత కిరాతకంగా కొట్టారని వివరించాడు. ఆ దెబ్బల వల్లే రేణుకాస్వామి ప్రాణాలు విడిచాడని ప్రదోష్ వాంగ్మూలం ఇచ్చాడు.

జైల్లోనూ మారని దర్శన్ తీరు

ఇదిలా ఉంటే.. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న హీరో దర్శన్‌ చుట్టూ మరిన్ని వివాదాలు అలుముకుంటున్నాయి. ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న అనుకుమార్, జగ్గ, ప్రద్యుష్, లక్ష్మణ్‌లను జైల్లో దర్శన్ వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జగ్గ, దర్శన్‌ల మధ్య జైల్లోనే పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దర్శన్ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని అనుకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు అప్రమత్తమై దర్శన్ బ్యారక్ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp