|  
FLASH NEWS
West Bengal News : మాల్డా ఆస్పత్రిలో 60 మంది పసిపాపల మృతి, దర్యాప్తులో షాకింగ్ నిజాలు  •  Sadhguru : ఇమ్మిగ్రేషన్ ఆఫీసు వద్దే ఆ 77 మంది గల్లంతు.. సద్గురు ఆవేదన వెనుక అసలు నిజం ఏంటి?  •  Tollywood Director Arrest : పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్… చంచల్‌గూడ జైలుకు తరలింపు  •  TOXIC Movie Review : ‘కేజీఎఫ్’ స్థాయి మ్యాజిక్ రిపీట్ అయిందా? యశ్ ‘టాక్సిక్’ సినిమా అసలు కథ మరియు పబ్లిక్ టాక్ ఇదే  •  Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!  • 
Skip to content

High Court of Telangana : 40 ఏళ్లు పరారీ.. బెస్ట్ టీచర్ అవార్డుతో రిటైర్మెంట్.. ఈ హంతకుడి ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

years escape best teacher award murderer high court
years escape best teacher award murderer high court

మహబూబాబాద్, సూర్య న్యూస్: పెరోల్ పై బయటకు వచ్చి ఏకంగా నలభై ఏళ్ల పాటు పోలీసుల కళ్ళు కప్పిన ఒక జీవిత ఖైదీ (Life Convict) కథ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జైలు నుంచి తప్పించుకున్న తర్వాత తన నేర చరిత్రను దాచిపెట్టి ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా (Government Teacher) ఉద్యోగం సాధించాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా అందుకుని పదవీరమణ పొందిన ఈ హంతకుడు చివరకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తాజా తీర్పుతో మళ్లీ కటకటాల పాలయ్యాడు.

నేరం.. శిక్ష.. పరారీ

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న 1982లో ఒక మార్వాడీ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో వరంగల్ జిల్లా కోర్టు 1983లో అతనికి జీవిత ఖైదు విధించింది. చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉన్న అతడిని 1983 డిసెంబర్ లో ముప్పై రోజుల పాటు పెరోల్ పై విడుదల చేశారు. ఆ తర్వాత గడువు ముగిసినా అతను తిరిగి జైలుకు వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

40 ఏళ్ల దొంగాట.. బెస్ట్ టీచర్ అవార్డు

జైలు నుంచి తప్పించుకున్న వీరన్న సుమారు నలభై ఏళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా జీవించాడు. తన గతాన్ని పూర్తిగా దాచిపెట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి అందరి మన్ననలు పొందాడు. ఏకంగా 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా దక్కించుకున్నాడు. విద్యాశాఖలో పనిచేసి 2013లో సూపర్‌యాన్యుయేషన్‌పై రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెలా ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ కుటుంబంతో కలిసి స్వగ్రామంలోనే స్థిరపడ్డాడు.

పట్టుకున్న టాస్క్ ఫోర్స్.. హైకోర్టు తీర్పు

ఎట్టకేలకు జైళ్ల శాఖ అధికారుల దర్యాప్తులో వీరన్న గుట్టు రట్టయింది. వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు మహబూబాబాద్ పోలీసులు వలపన్ని మే 2024లో అతడిని స్వగృహంలోనే అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే తన భర్తకు వయసు పైబడినందున వైద్య కారణాల రిత్యా పెరోల్ ఇవ్వాలని అతడి భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆగస్టు 17, 2026న పిటిషన్ ను పూర్తిగా కొట్టివేసింది. నేర చరిత్రను దాచి ప్రభుత్వ ఉద్యోగం చేయడం తీవ్రమైన మోసమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వారికి మినహాయింపులు ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంటూ మిగిలిన జీవిత ఖైదు శిక్షను అనుభవించాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp