|  
FLASH NEWS
West Bengal News : మాల్డా ఆస్పత్రిలో 60 మంది పసిపాపల మృతి, దర్యాప్తులో షాకింగ్ నిజాలు  •  Sadhguru : ఇమ్మిగ్రేషన్ ఆఫీసు వద్దే ఆ 77 మంది గల్లంతు.. సద్గురు ఆవేదన వెనుక అసలు నిజం ఏంటి?  •  Tollywood Director Arrest : పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్… చంచల్‌గూడ జైలుకు తరలింపు  •  TOXIC Movie Review : ‘కేజీఎఫ్’ స్థాయి మ్యాజిక్ రిపీట్ అయిందా? యశ్ ‘టాక్సిక్’ సినిమా అసలు కథ మరియు పబ్లిక్ టాక్ ఇదే  •  Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!  • 
Skip to content

Sadhguru : ఇమ్మిగ్రేషన్ ఆఫీసు వద్దే ఆ 77 మంది గల్లంతు.. సద్గురు ఆవేదన వెనుక అసలు నిజం ఏంటి?

Sadhguru_77_Missing_Immigration_SuryaNews.jpg
Sadhguru_77_Missing_Immigration

​న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు (Flash Floods) భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ప్రళయంలో కైలాస యాత్రకు (Kailash Yatra) వెళ్లిన ఇషా ఫౌండేషన్ యాత్రికులు చిక్కుకున్నారు. గిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద భారీ వరద పోటెత్తడంతో ఏకంగా 77 మంది యాత్రికుల ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. వరద ధాటికి భవనాలు, పట్టణంలో పెద్ద భాగం మునిగిపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

టిబెట్ వైపు నుంచి భోటే కోషి నదికి వచ్చిన వరదలు నేపాల్ లోని రసువా, నువాకోట్ ప్రాంతాలను ముంచెత్తాయి. కైలాస యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఇషా ఫౌండేషన్ తరఫున మొత్తం 21 బృందాలు ఈ యాత్రకు వెళ్లాయి. వీరిలో 495 మంది సురక్షితంగా వెనక్కి వచ్చారు. ఇంకా 743 మంది టిబెట్ లో, 148 మంది నేపాల్ లో ఉన్నట్లు సమాచారం. ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద 77 మంది గల్లంతు కాగా, తిమురేలో మరో ముగ్గురు వాలంటీర్లు చిక్కుకున్నారు.

నేపాల్ టూరిజం బోర్డు అంచనా ప్రకారం మొత్తం 291 మంది విదేశీయులు గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. నేపాల్ లో ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. పరిస్థితి తీవ్రతను గమనించిన భారత ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు రిలీఫ్ మెటీరియల్ తో అక్కడికి బయలుదేరాయి. సద్గురు స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp